ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై మావోలు చేసిన దాడిని అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ఖండించింది. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నక్సల్స్ దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. దేశం అభివృద్ధి పధంలో నడుస్తుంటే , హింసాత్మక మార్గంలో నడిచే నక్సల్ విధానం రూపుమాపాలని నినాదాలు చేశారు. మరణించిన జవానుల కుటుంబాలకు ప్రగాడ సానుభతి తెలిపారు.
ఇదీ చదవండి: 8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు