ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో విశాఖ దేవరాపల్లి మండలంలోని వాకపల్లి, మామిడిపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాలను, పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. అధికారులను అడిగి పనుల పురోగతిని తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల వివరాలను ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ఆయనకు వివరించారు. సాయంత్రం కలెక్టర్ వి.వినయ్‌చంద్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. వాకపల్లి, మామిడిపల్లి, తారువ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. సిబ్బంది ఏ మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నదీ గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనల్లో జేసీలు గోవిందరావు, అరుణ్‌కుమార్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య, డీఈఓ లింగేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ లీలావతి, అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, తహసీల్దార్ జె.రమేశ్‌బాబు, ఎంపీడీఓ సీహెచ్.సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫైజర్ 'కరోనా వ్యాక్సిన్' 90శాతం ప్రభావవంతం!