Andhra University land issue: ఆంధ్ర విశ్వవిద్యాలయం, అటవీశాఖలకు చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకోసం సర్వే చేయడం ఏంటని.... రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన భూమిని కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భూమి పరిరక్షణకు అటవీ శాఖ వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశాయి.
'కడప జిల్లాకు చెందిన నేతల కోసమే విశాఖ భూములను అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప రాజకీయ నేతలు ఉత్తరాంధ్రలోని రిజర్వుడు ఫారెస్ట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం భూములను కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులతో వచ్చి సర్వే చేయడం జరిగింది. దీనికి జీవీఎంసీ టౌన్ అధికారి చంద్రశేఖర్ దగ్గరుండి సర్వే చేశారు. ఇదంతా చూస్తుంటే అవినీతి ఏవిధంగా జరుగుతుందో అన్నవిషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌కి ఫిర్యాదు చేశాం'. - పీతల మూర్తియాదవ్, జనసేన కార్పొరేటర్.
విశాఖలో ప్రభుత్వ భూమిని జీవీఎంసీ సర్వేయర్లు సర్వే చేయడం కలకలం రేపుతోంది. ప్రైవేటు భూమిగా మార్చేందుకు జరుగుతున్న యత్నాలంటూ.. రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 320 కోట్ల రూపాయిల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు.. అధికార పక్షనేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. నగరంలో విలువైన భూములను కబ్జా చేసేందుకు జరుగుతున్న యత్నాలను.. ఆయా శాఖలు అడ్డుకోకపోతే ఎలా అని విపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: