ETV Bharat / state

ఘనంగా ప్రొఫెసర్ బాబీ వర్థన్ పదవీ విరమణ

author img

By

Published : Sep 30, 2020, 7:00 PM IST

మీడియా రంగంలో వచ్చిన అనేక సాంకేతిక మార్పులకు అనుగుణంగా వజ్రా పేరిట ఆంధ్రవిశ్వ విద్యాలయంలో జర్నలిజం స్టూడియోను నెలకొల్పారాయన. 40 సంవత్సరాలుగా జర్నలిజం విభాగంలో సేవలు అందించి.. అనేక మంది పాత్రికేయులను తయారు చేశారు. అటువంటి ప్రొఫెసర్ పి. బాబీ వర్థన్ పదవీ విరమణ వేడుకను.. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

prof. bobby vardhan  retirement celebrations in au
ఘనంగా ప్రొఫెసర్ బాబీ వర్థన్ పదవీ విరమణ కార్యక్రమం

ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి. బాబీవర్థన్ పదవీ విరమణ వేడుక, ఏయూ జర్నలిజం విభాగంలో ఘనంగా జరిగింది. నలభై సంవత్సరాలుగా జర్నలిజం విభాగంలో.. వేలాది మందికి బాబీవర్థన్ విద్యా సేవలను అందించారు. అనేక విశ్వ విద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్​గా పని చేశారు. దిన పత్రికలకు ప్రజా సంబంధ అంశాలపై వ్యాసాలు రచించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం మీడియా విభాగానికి కన్వీనర్​గా సేవలు అందించారు. మీడియా రంగంలో వచ్చిన సాంకేతికతకు అనుగుణంగా వజ్రా పేరిట జర్నలిజం స్టూడియోను విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. జర్నలిజం బోర్డ్​ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్​గా సేవలు అందించిన.. ఆచార్య బాబీ వర్థన్​ను విశ్వ విద్యాలయం ఘనంగా సత్కరించింది. దేశ నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి.. పదవీ విరమణ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

మవోయిస్టు కీలక నేత అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.