Coromandel Express accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కొందరు స్వల్పంగా గాయపడగా... మరికొందరి ఫోన్లు అందుబాటులో లేవని తెలిపారు. రైలు ప్రమాద దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యనారాయణతో పాటు జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వర్రావు సమీక్ష నిర్వహించారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రయాణికులకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే శాఖ, ఒడిశా అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం మొత్తం 137 మంది ప్రయాణికులు కోరమాండల్‌లో ప్రయాణిస్తున్నట్టుగా వివరాలు లభించాయని తెలిపింది. ఇందులో 22 మంది అసలు ప్రయాణం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రమాద సమయంలో రైల్లో ఉన్న 80 మంది ఏపీకి చెందిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. మరో 20 మందికి సంబంధించిన ఫోన్లు పని చేయటం లేదని ప్రభుత్వం తెలిపింది.
కోరమాండల్‌లో ప్రయాణించిన రాష్ట్రవాసుల్లో 267 మంది సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విశాఖ నుంచి 165 మంది, రాజమహేంద్రవరం-22 మంది, విజయవాడ-80 మంది ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. కోరమాండల్‌లో ప్రయాణించిన 20 మంది రాష్ట్రవాసులకు స్వల్ప గాయాలు అయినట్లు వెల్లడించారు. క్షతగాత్రుల్లో విశాఖకు చెందిన-11 మంది, ఏలూరుకు చెందిన- 2, విజయవాడ నుంచి ఏడుగురుగురు ప్రయాణించినట్లు తెలిపారు.
ఫోన్లు స్విచ్ఛాఫ్: కోరమాండల్‌లో ప్రయాణించిన 113 మంది రాష్ట్రవాసుల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. విశాఖకు చెందిన-76, రాజమహేంద్రవరానికి చెందిన- 9 మంది, విజయవాడకు చెంది 28 మంది ఫోన్లు స్వచ్ఛాఫ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్ ఉన్నా... కోరమాండల్‌లో 82 మంది ఏపీకి చెందినవారు ప్రయాణించలేదని ప్రభుత్వం తెలిపింది.
'కేంద్రం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం'.. రైల్వే మంత్రి రాజీనామాకు విపక్షాల డిమాండ్
హావ్‌డాలో ప్రయాణించిన 49 మంది సురక్షితం హావ్‌డాలో ప్రయాణించిన రాష్ట్రవాసుల్లో 49 మంది సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. హావ్‌డాలో ప్రయాణించిన ఇద్దరు రాష్ట్రవాసులకు స్వల్ప గాయాలయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హావ్‌డాలో ప్రయాణించిన ఏపీకి చెందిన 28 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ అయనట్లు ప్రభుత్వం తెలిపింది.
200 అంబులెన్సులు.. 1200 మంది సిబ్బంది.. భారీ క్రేన్లతో రెస్క్యూ ఆపరేషన్ ఇలా..
హెల్ప్‌లైన్ నంబర్లు: ప్రస్తుతం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అటు యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లోనూ 39 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది. దీంతో పాటు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళంలో నూ హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సమాచారాన్ని అందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 08912 746330, 08912 744619 విజయనగరంలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08922 221202, 08922 221206 శ్రీకాకుళంలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08942 286213, 286245 విజయవాడలో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్: 67055 విజయవాడలో బీఎస్‌ఎన్‌ఎల్ హెల్ప్‌లైన్ నంబర్: 0866 2576924 రాజమహేంద్రవరంలో రైల్వే హెల్ప్‌లైన్ నంబర్: 65395 రాజమహేంద్రవరంలో బీఎస్‌ఎన్‌ఎల్ హెల్ప్‌లైన్ నంబర్: 0883 2420541 హెల్ప్‌లైన్ నంబర్లు 044-2535 4771, 67822 62286 బంగాల్ హెల్ప్‌లైన్ నంబర్లు: 033-2214 3526, 2253 5185