విశాఖ జిల్లాకు చెందిన సుమారు 24మంది యాత్రికులు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఎంతో సరదాగా గడిపారు.. ఆ తర్వాత ఇక ఇంటికి పయనమవుతున్న తరుణంలో వారికి కరోనా వైరస్ అడ్డొచ్చింది. ఈ క్రమంలో వారు అక్కడే చిక్కుకున్నారు.
కరోనా ప్రభావంతో రాష్ట్రానికి తిరిగి రావడానికి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవటం వల్ల భువనేశ్వర్‌లోని జయదేవ్ బీహార్ జంక్షన్ సమీప రహదారిపై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమను స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.