ETV Bharat / state

LOVE MARRIAGE: అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి.. ఒక్కటైన జంట - vishakapatnam latest updates

Russian Girl Andhra Boy Love Marriage: ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఆ జంట. ఖండాంతరాలు దాటి.. ఆ ఇద్దరు తమ ప్రేమను గెలిపించుకున్నారు. విశాఖకు చెందిన అబ్బాయి, రష్యాకు చెందిన అమ్మాయి పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.

స్వదేశీ అబ్బాయి...విదేశీ అమ్మాయి..ఓ పెళ్లి

author img

By

Published : Dec 30, 2021, 12:32 PM IST

అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి.. ఒక్కటైన జంట

LOVE MARRIAGE: ఖండాంతరాలు దాటింది వారి ప్రేమ.. కులం, మతమే కాదు ఖండాంతరాలు కూడా అడ్డుకాదని నిరూపించింది ప్రేమజంట.. విశాఖలో రష్యా అమ్మాయి వివాహం.. ఆంధ్రా అబ్బాయితో హిందూ సంప్రదాయం ప్రకారం వేడుకగా జరిగింది.

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడకు చెందిన సర్పంచి దంపతులు బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు చిన్న కుమారుడు నరేష్ రష్యాలో సాప్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే సంస్థలో రష్యాకు చెందిన ఇరీనా ఉద్యోగం చేస్తుంది. నరేష్, ఇరీనా మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తన ప్రేమను నరేష్ తండ్రి ముత్యాలనాయుడుతో చెప్పారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు.

రష్యాలో ఇరీనా వారి తల్లిదండ్రులను ఒప్పించారు. ఇరువురు కుటుంబ సభ్యులు, బంధువులు సమక్షంలో కె.కోటపాడు మండలం కింతాడలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి రష్యా నుంచి బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, పలువురు నాయకులు హాజరై వధూవరులను దీవించారు.

ఇదీ చదవండి:

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 13వేల మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.