రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే అమర్నాథ్ - anakapalli latest news
విశాఖ జిల్లా వెంకుపాలెంలో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు.

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి మండలంలోని వెంకుపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా.. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అమర్నాథ్ పేర్కొన్నారు.