ETV Bharat / state

విశాఖ మెడపై అమ్మోనియం నైట్రేట్‌ కత్తి... 54వేల టన్నుల నిల్వలు!

author img

By

Published : Oct 9, 2020, 12:56 PM IST

లెబనాన్‌ రాజధాని బీరుట్​లో జరిగిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు తర్వాత విశాఖ వాసుల్లో భయం మెుదలైంది. ఎందుకంటే దేశంలో ఈ ప్రమాదకరమైన రసాయనం దిగుమతి చేసుకుంటున్న ఏకైక పోర్టు విశాఖనే. ఇక్కడ గోదాముల్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు 54వేల టన్నులకు చేరుకున్నాయి.

Ammonium nitrate reserves in Visakhapatnam reached 54,000 tonnes
విశాఖ వాసులను ఆందోళనకు గురిచేస్తోన్న అమ్మోనియం నైట్రేట్

విశాఖ నగరంపై అమ్మోనియం నైట్రేట్‌ కత్తి వేలాడుతుండడం పలువురు నగరవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అమ్మోనియం నైట్రేట్‌ కారణంగా ఎంతటి భారీ స్థాయి విధ్వంసాలు జరగవచ్చన్న అంశం బీరుట్‌ ఘటన అనంతరమే అత్యధికులకు అవగతమైంది. లెబనాన్‌ దేశంలోని బీరుట్‌ నగర నౌకాశ్రయంలో ఆగస్టు నాలుగో తేదీన అమ్మోనియం నైట్రేట్‌ కారణంగా సంభవించిన భారీ పేలుడు ప్రపంచ దేశాల వెన్నులో చలిపుట్టించింది. అణుబాంబుల ప్రయోగాల సమయంలో మినహా బీరుట్‌ సంఘటనలో వెలువడినంత శక్తి(ఎనర్జీ) గతంలో వెలువడిన దాఖలాలు లేవని, ప్రపంచంలోని అతిపెద్ద అణురహిత పేలుళ్లలో బీరుట్‌ పేలుడు ఒకటని శాస్త్రవేత్తలు తేల్చారంటే బీరుట్‌ పేలుళ్ల తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంఘటనలో 181 మంది చనిపోగా ఆరువేల మంది గాయపడ్డారు. వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీరుట్‌ పేలుళ్లకు సంబంధించిన 16 వీడియో దృశ్యాలను యు.కె.లోని షెఫ్ఫీల్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు విశ్లేషించారు. వాటి ఆధారంగా బీరుట్‌ ప్రమాద తీవ్రత 0.50 కిలోటన్నుల నుంచి 1.12 కిలోటన్నుల టి.ఎన్‌.టి. పేలితే సంభవించే ప్రమాద తీవ్రతకు సమానమైనదని తేల్చారు. బీరుట్‌ ప్రమాద ప్రభావం సుమారు 250 కి.మీ.ల దూరంలో నివసిస్తున్నవారిపై సైతం చూపగలిగినట్లు యు.ఎస్‌. జియోలాజికల్‌ సర్వే విభాగం శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధరణ అయ్యింది. ఎవరైనా ఉద్దేశపూర్వంగా అమ్మోనియం నైట్రేట్‌ను పేలుడు పదార్థంగా మారిస్తే తప్ప దాని కారణంగా ఎలాంటి హానీ ఉండదనుకున్న వారి భ్రమలు పటాపంచలయ్యాయి. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, నిర్ణయాలు తీసుకోవడంలో జరిగే తాత్సారం ఎలాంటి భయానక పరిస్థితులు సృష్టిస్తాయన్న విషయానికి బీరుట్‌ ఘటన నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది.

అప్రమత్తమైనా ఆచరణ సున్నా...
బీరుట్‌ సంఘటనతో భారతదేశంతో సహా పలుదేశాలు అప్రమత్తమై అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల భద్రతపై హడావుడిగా సమీక్షలు జరిపి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ రవాణా, నిల్వ, వినియోగం తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలన్న ఆలోచనలు కూడా చేస్తున్నారు. భారతదేశం కూడా భారీఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అమ్మోనియం నైట్రేట్‌ తయారీ పరిశ్రమలు కూడా ఉన్నాయి. అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించి ఎరువుల తయారీనే కాకుండా గనుల తవ్వకాల్లో పేలుడు పదార్థంగా కూడా వినియోగిస్తారు. దేశంలో జరిగిన పలు ఉగ్రవాదదాడుల్లో అమ్మోనియం నైట్రేట్‌ వినియోగించిన దాఖలాలు ఉన్నప్పటికీ ఆ సరకు రవాణా, నిల్వలపై ప్రభుత్వ పర్యవేక్షణ అత్యంత బలహీనంగా ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమ్మోనియం నైట్రేట్‌ ఆధారిత పేలుడు సంఘటనలు జరిగినప్పుడల్లా నిబంధనల ఉల్లంఘనలపై చర్చ జరుగుతుందిగానీ నేటికీ వ్యవస్థల్ని బలోపేతం చేసుకునే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కనీసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ నిబంధనల అమలు ఎలా జరుగుతోందన్న విషయాల్ని పరిశీలించడంలోనూ పోలీసులు, పెసో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు.

ఒకేచోటుకు భారీగా నిల్వలు....

దేశంలోని పలు ప్రాంతాలకు దిగుమతి చేసుకోవడం కన్నా ఒకేచోటకు మొత్తం సరకును దిగుమతి చేసుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపితే బాగుంటుందని గతంలో నిర్ణయించారు. అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతికి అత్యంత అనువైన నౌకాశ్రయంగా విశాఖ నౌకాశ్రయాన్ని ఎంచుకున్నారు. దీంతో విశాఖ నౌకాశ్రయానికి ఏటా 2.70లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతి అవుతోంది. దాన్ని సమీపంలోనే ఉన్న గోదాముకు తరలించి అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతారు. బీరుట్‌ ఘటన అనంతరం విశాఖ కేంద్రంగా జరుగుతున్న అమ్మోనియం నైట్రేట్‌ రవాణా చర్చనీయాంశంగా మారింది. సరకు దిగుమతి కావడం, ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో హీనపక్షం 20 వేల టన్నుల వరకు గోదాములోనే ఉండిపోతోందని, ఆయా నిల్వల కారణంగా ప్రమాదానికి అవకాశాలున్నాయని విశాఖలో స్థిరపడ్డ విశ్రాంత ఐ.ఎ.ఎస్‌. అధికారి ఇ.ఎ.ఎస్‌.శర్మ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. భారతదేశ అవసరాలకు అంతభారీమొత్తంలో దిగుమతులు అవసరమా? అది కూడా ఒక్క విశాఖకే భారీఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను ఎందుకు తెస్తున్నారు? ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన చేస్తున్న హెచ్చరికలు ఆలోచింపచేస్తున్నాయి.

వరస కడుతున్న అమ్మోనియం నైట్రేట్‌ నౌకలు...

బీరుట్‌ సంఘటన అనంతరం అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు విశాఖలోని గోదాములో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వచేయకుండా నిషేధాజ్ఞలు విధించాయి. అక్కడి వరకు బాగానే ఉంది కానీ విశాఖకు నౌకలు రాకుండా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. దీంతో ఆగస్టు నెల 11వ తేదీ నుంచి ఇప్పటివరకు నాలుగు నౌకలు వచ్చాయి. ఆయా నౌకలన్నింటిలో కలిపి సుమారు 54 వేల టన్నుల వరకు అమ్మోనియం నైట్రేట్‌ ఉంది. బీరుట్‌ ఘటన అనంతరం సుమారు రెండునెలల కిందట అమ్మోనియం నైట్రేట్‌ నౌక వచ్చినప్పటికీ అందులో ఉన్న సరకు ఏవిధంగా గమ్యస్థానాలకు చేర్చాలన్న అంశంపై అధికారులు నిర్ణయానికి రాలేకపోయారు. అధికారుల తాత్సారం కారణంగా విశాఖ నౌకాశ్రయానికి మరో మూడు అమ్మోనియం నైట్రేట్‌ నౌకలు కూడా వచ్చాయి. అందులోని సరకును గోదాముకు కాకుండా నేరుగా గమ్యస్థానాలకు చేర్చాలని నిర్ణయించారుగానీ ఆ ప్రక్రియ అమలుకు చట్టపరంగా అనేక చిక్కులు ఎదురవుతున్నాయి.

పట్టించుకోని పెసో అధికారులు....

అమ్మోనియం నైట్రేట్‌ నిల్వ, రవాణాలకు సంబంధించిన అనుమతులను ‘పెట్రోలియం, పేలుడుపదార్థాల భద్రత సంస్థ(పెసో)’ అధికారులు ఇస్తుంటారు. నాగపూర్‌లోని కార్యాలయ అధికారులు ఆయా అనుమతులు ఇస్తారుకాబట్టి విశాఖలోని పెసో అధికారులు పట్టించుకోవడంలేదు. కేంద్రప్రభుత్వ పరిధిలోని అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో రాష్ట్రప్రభుత్వ అధికారులు కూడా వేచిచూసే ధోరణినే అనుసరిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతి చేసుకునే కొన్ని సంస్థలు తమ సరకును నేరుగా తరలించుకునేందుకు పెసో నుంచి అనుమతులు పొందాయి. నిబంధనల ప్రకారం విశాఖ నౌకాశ్రయ అధికారులకు సమర్పించాల్సిన పత్రాలను ఆయా సంస్థలు సమర్పించకపోవడంతో నౌకాశ్రయ అధికారులు ఆసరకును అప్పగించలేకపోతున్నారు. ఫలితంగా బొగ్గు, క్వారీల తవ్వకాలకు అమ్మోనియంనైట్రేట్‌ను ఉపయోగించే సంస్థలు ఇప్పటికే సరకు అందక ఇబ్బందిపడుతున్నాయి. ఆమేరకు ఆయా సంస్థలు రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా లేఖలు రాస్తుండడంతో రాష్ట్రప్రభుత్వం కూడా ఏమీ చేయలోపాలుపోని నిస్సహాయస్థితిలో పడింది. కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, పోలీసు అనుమతులను పునరుద్ధరించలేని పరిస్థితి ఉండడంతో ఏమి చేయాలన్న అంశంపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. వ్యవహారం మొత్తం సంక్లిష్టంగా మారడంతో విశాఖ నౌకాశ్రయంలోని నౌకల్లో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు ఎప్పటికి ఖాళీ అవుతాయో తెలియని దుస్థితి తలెత్తింది. కేవలం 2,750టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలితేనే బీరుట్లో భారీ ప్రమాదం సంభవిస్తే ఏకంగా 54వేల టన్నులున్న విశాఖలోని నౌకల్లో ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నది పలువుర్ని తీవ్రభయాందోళనలకు గురిచేస్తోంది. బీరుట్‌ ప్రమాదం కారణంగా ఏకంగా లెబనాన్‌ దేశ ప్రధాని రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఉన్నతాధికారులు తక్షణ పరిష్కార చర్యలకు ఉపక్రమించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కీలక దశకు సీఎంఆర్​ఎఫ్​ కుంభకోణం కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.