అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రులలో భోజన పాకెట్స్ని పంపిణీని నిర్వహిస్తోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ దాతల సహకారంతో రోగి సహాయకుల కోసం భోజన పొట్లాలను వితరణ చేస్తోంది. విశాఖలో రోజు 3000 భోజనం పాకెట్స్ పంచిపెడుతోంది.
కేజీహెచ్, విక్టోరియా, ఈఎన్టీ , ప్రభుత్వ ఛాతీ, మెంటల్, రైల్వే ఆసుపత్రుల వద్ద, జీవీఎంసీ నైట్ షెల్టర్లు నిరాశ్రయులకు ఈ పొట్లాలు అందించారు. రోగి సహాయకులు , హెల్త్ వర్కర్స్, నిరాశ్రయులకు లబ్ది కలుగుతోంది. దాతలు సహకరిస్తే ఎక్కువ మందికి సేవ చేయగలమని అక్షయ పాత్ర అధ్యక్షుడు డాక్టర్ భక్తదాస అన్నారు. సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ఇదీ చూడండి: