హరేకృష్ణ మూవ్మెంట్ అండ్ అక్షయపాత్ర ఫౌండేషన్... దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తోంది. కొవిడ్-19 రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా డ్రై రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రారంభించారు. మైక్రోన్ కంపెనీ సహాయంతో సుమారు వెయ్యి కిట్లను విశాఖలోని పలు మురికివాడల్లోని పేదలకు అందిస్తున్నట్లు హరేకృష్ణ మూవ్మెంట్ అండ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. లాక్డౌన్ సమయంలో దాతలు పేదలకు చేస్తున్నసేవలను ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 14,933 కరోనా కేసులు, 312 మరణాలు