రవాణా రంగంలోని ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది వాహన పన్ను, బీమా 50 శాతం తగ్గించాలని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లో ఆటోలు నడపడానికి అవకాశం కల్పించాలని కోరుతూ... ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన రైలు..16 మంది దుర్మరణం