విశాఖలోని సింహాచలం దేవస్థానం పాలకమండలి.. భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందని తెదేపా నాయకురాలు అదితి గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సంప్రదింపులు, సహేతుక కారణాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. దేవస్థానం గోశాలలో పనిచేస్తున్న పౌరసేవా కార్మికులను తొలగించడం ఇందులో ప్రధానమైనదని చెప్పారు.
వారి అసంబద్ధ నిర్ణయాల వల్ల గోవులు పోషణ లేక చనిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల సాకుతో ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పారు. గోశాల భూముల పై కన్నేసి.. కొత్త పాలక వర్గం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింహాచలం దేవస్థానం దాతలు, భక్తుల మనోభావాలను కించపరిచేటట్టు ఉన్న ఈ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవలని అధితి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా కేసులు.. 24 గంటల్లో 40 మంది మృతి