ETV Bharat / state

అనిశా వలలో ప్రధానోపాధ్యాయురాలు

చోడవరం జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లంచానికి ఆశ పడ్డారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహకురాలు నుంచి రూ.4500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

అనిశా వలలో ప్రధానోపాధ్యాయురాలు
అనిశా వలలో ప్రధానోపాధ్యాయురాలు
author img

By

Published : Mar 14, 2020, 11:48 AM IST

అనిశా వలలో ప్రధానోపాధ్యాయురాలు

విశాఖ జిల్లా చోడవరం బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పాఠశాలలో మధ్యాహ్నా భోజనాన్ని వంతుల కింద అయిదుగురు మహిళలు వండుతున్నారు. ఈ క్రమంలో జనవరిలో వంట చేసిన ఆబోతుల సత్యవతి అలియాస్ మంగకు ఫిబ్రవరి 28న రూ.30 వేలు వచ్చాయి. ఈ బిల్లును చెల్లించేందుకు రూ.5000 ఇవ్వాలని ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి డిమాండ్ చేశారు. ఈ విషయమై లంచం ఇవ్వడం ఇష్టం లేని మంగ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాఠశాలకు ఆకస్మికంగా వచ్చిన ఏసీబీ అధికారులు ప్రధానోపాధ్యాయురాలు రూ.4,500 లంచం తీసుకుంటుండగా రెజ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. హెచ్​ఎమ్​ని అరెస్ట్​ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రంగరాజన్ తెలిపారు.

ఇదీ చూడండి: తిరుపతి కమాండ్ కంట్రోల్ సీఐ నివాసంలో అనిశా సోదాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.