ETV Bharat / state

యువతి ఆత్మహత్య.. కడుపునొప్పే కారణమా? - యువతి ఆత్మహత్య న్యూస్

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జంగాలపాలెంలో సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతన్నట్లు తండ్రి అప్పలనాయుడు పోలీసులకు తెలిపారు.

A young woman committed suicide by hanging herself to a fan in Jangalapalem, Visakhapatnam district
ఫ్యాన్​కు ఉరివేసుకుని యువతి ఆత్మహత్య... కడుపునొప్పే కారణమా?
author img

By

Published : Jan 24, 2021, 11:26 AM IST

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జంగాల పాలెంలో నాగమణి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి అప్పలనాయుడు మాకవరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి వెళ్లిన నాగమణి ఎంతసేపటికీ బయటకు రాకపోవడం గమనించిన తండ్రి.. స్థానికుల సాయంతో తలుపులను పగలగొట్టాడు.

అప్పటికే ప్యాన్​కు ఉరివేసుకున్న నాగమణి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను నర్సీపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు యువతిని విశాఖపట్నంలోని కేజీహెచ్​కు తీసుకెళ్లారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న మాకవరపాలెం పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

తెదేపా నేత శ్రీభరత్‌కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.