ETV Bharat / state

నిన్నటి వరకు ఐఏఎస్​గా సేవలు... ఇప్పుడు రైతుగా పొలం పనులు

ఐఏఎస్​ అధికారిగా పలు పదవులు అలంకరించిన ఆయన... ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే స్వగ్రామానికి చేరుకుని పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

A retired IAS officer is doing farming in Visakhapatnam district

author img

By

Published : Jan 4, 2021, 4:52 AM IST

నిన్నటి వరకు ఐఏఎస్ హోదాలో బిజీగా గడిపిన ఆ అధికారి ఇప్పుడు వరి నూర్పిడి పనుల్లో పాల్గొని సాగుపై తనకున్న మమకారం చాటుకున్నారు. రాష్ట్ర పునరావాస కమిషనర్​గా పనిచేసిన తమర్భ బాబురావు నాయుడిది విశాఖ జిల్లా పాడేరు మండలం మారుమూల డోకులూరు స్వగ్రామం. రాష్ట్రంలోని ఆదివాసీలలో తొలి ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన... పలు పదవులు చేపట్టారు. కడప జిల్లా కలెక్టర్​గా, విశాఖపట్నం ఉడా ఛైర్మన్​గా సేవలందించారు. 2020 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే స్వగ్రామానికి చేరుకుని పొలం పనుల్లో నిమగ్నమయ్యారు

ఇదీ చదవండి

కొడాలిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.