ఓ తల్లి శునకం విశాఖ జిల్లా పాడేరు గ్రంథాలయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. తన వెంటనే పిల్ల శునకం ఆడుకుంటూ నడుస్తోంది. అయితే హఠాత్తుగా ఓ వాహనం పిల్ల కుక్కను ఢీ కొట్టడంతో చనిపోయింది. తన బిడ్డ.. వెనకే వస్తుందనుకున్న తల్లికి.. పిల్ల విగతజీవిగా ఉండిపోవడం చూసి తల్లడిల్లిపోయింది. దగ్గరికి వెళితే అయిన వస్తుందేమోననుకున్నా నిరాశే ఎదురైంది. ఏం చేయాలో తెలియని తల్లి శునకం.. అటు.. ఇటు తిరగసాగింది. కోపంతో రోడ్డుపైన వెళుతున్న వాహనదారులను బెదిరించింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు చలించిపోయారు.
ఇదీ చదవండీ.. ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్... ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు