విశాఖ పాడేరు ఏజెన్సీలో ముంచంగిపుట్టు మండలం, టెంకా పుట్టు గ్రామంలో సుమారు 925 కిలోల గంజాయిని, ఇద్దరి నిందితులని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. పాడేరు ఏజేన్సీలోని ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడిన గంజాయి విలువ సుమారు 85 లక్షలు ఉంటుందని, ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. గంజాయి యాజమాని గురించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇది చూడండి: 200 కిలోల గంజాయి స్వాధీనం... ఇద్దరు అరెస్ట్