విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తున్న 900 కిలోల గంజాయిని శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌ఛార్జి సీఐ గోవిందరావు వెల్లడించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అరకు వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఆపి తనిఖీ చేయగా అందులో 30 బస్తాల్లో 900 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. బిహార్‌కు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి తన సొంత లారీలో గంజాయి తరలించడానికి డ్రైవర్‌ను సహాయకుడిగా పంపారన్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను రిమాండ్ తరలించామని ... ప్రధాన నిందితుడైన ప్రకాష్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు.. దీని వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుకున్న గంజాయి విలువ 30 లక్షల వరకు ఉంటుందని రాష్ట్రం దాటితే దీని విలువ కోటి రూపాయలకు పెరుగుతుందన్నారు.
ఇదీ చదవండి: 'వేతనాలే అడిగారు.. ప్రభుత్వ పెద్దలు దోచుకున్న సొమ్ము అడగలేదు'