దేశీయ ప్రయాణికులు ( మే నుంచి సెప్టెంబరు మధ్య విశాఖ నుంచి రాకపోకలు చేసినవారు)
హైదరాబాద్ - 83,136
దిల్లీ - 54,611
బెంగళూరు - 48,377
చెన్నై - 16,025
కోల్‌కతా 15,795
ముంబయి - 8276
అంతర్జాతీయ ప్రయాణికులు (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య విశాఖకు వచ్చినవారు)
కువైట్ - 1005
దోహా - 862
దుబాయ్ - 710
బిష్కెక్ - 697
షార్జా - 403
రస్-అల్-ఖైమా (యూఏఈ) - 361
దమ్మామ్ - 352
మస్కట్ - 327
లండన్ - 287
బోరిస్పోల్ - 275
కౌలాలంపూర్ - 245
మనీలా - 244
రియాద్ - 167
ధాకా - 150
అబుదాబి - 148
సిడ్నీ - 86
మెల్‌బోర్న్ - 45
జాతీయ ప్రయాణికులు - 2,23,939
అంతర్జాతీయ ప్రయాణికులు - 6516
మొత్తం ప్రయాణికులు - 2,30,455
రాకపోకలు చేసిన విమానాలు - 2,745
(ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా)
ఎక్కువ మంది ప్రయాణికులు విశాఖ నుంచి హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుల మధ్యే ప్రయాణాలు సాగిస్తున్నారు. గత 6 మాసాల్లో మొత్తం ప్రయాణికుల్ని గమనిస్తే.. ఏకంగా 1,86,124 మంది ఈ 3 నగరాలకే రాకపోకలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. 80.76 శాతం మంది విశాఖ నుంచి ఆయా గమ్యస్థానాలకు రాకపోకలు సాగించారు.
ఆ 3 రూట్ల మధ్యే డిమాండ్ ఎక్కువ..
హైదరాబాద్, దిల్లీ, బెంగళూరుల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనువైన విమానాలు నడుస్తున్నాయి. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు దిల్లీకి, తూర్పు, మధ్య రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు హైదరాబాద్‌కు, కేరళ లాంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాల్సినవారు బెంగళూరు విమానాశ్రయాల్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూడు రూట్ల మధ్య ఎక్కువ డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం విశాఖ నుంచి హైదరాబాద్‌కు 5, బెంగళూరుకు 4, దిల్లీకి 3 విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
ఇక్కడే సామర్థ్యం ఎక్కువ..
విమానాశ్రయం | మే | జూన్ | జులై | ఆగస్టు | సెప్టెంబరు | మొత్తం |
విశాఖపట్నం | 7,958 | 39,673 | 42,153 | 60,920 | 79,727 | 2,30,431 |
విజయవాడ | 4,848 | 18,934 | 20,953 | 30,387 | 37,884 | 1,13,006 |
రాజమహేంద్రవరం | 681 | 5,639 | 7,714 | 10,358 | 14,525 | 38,917 |
విశాఖలోనే నిండు సామర్థ్యం..
విమానాల్లో సీట్లు నిండు సామర్థ్యం విశాఖలోనే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా తక్కువ విమానాలు తిరుగుతున్నా.. ఎక్కువమంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత విమానాశ్రయాల్లో తక్కువ విమానాలనే అనుమతిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలతో పోల్చితే విశాఖనే ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు.
విజయవాడకే ఎక్కువ విమానాలు..
వందే భారత్ విమానాల పరంగా విజయవాడకు ఎక్కువ విమానాలొచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చిన విదేశీ ప్రయాణికులు విజయవాడలోనే అధికంగా దిగారు. ఫలితంగా అక్కడ ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లుగా పేర్కొ న్నారు. విశాఖలో గత 6 మాసాల్లో 45 విమానాలు విదేశాల నుంచి వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తం ప్రయాణికుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 2.82 శాతమున్నారని వివరించారు. ప్రస్తుతం విశాఖ నుంచి రోజుకు సుమారు 16 నుంచి 18 విమాన సర్వీసులు రాకపోకలు చేస్తున్నాయి. విమాన సర్వీసులు పెంచే విషయమై చర్చలు జరుపుతున్నామని విమానాశ్రయ డైరెక్టర్ రాజకిషోర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'ఆ రోజున అమరావతి కోసం రాష్ట్ర ప్రజలందరూ ఒక్కటి కావాలి'