విశాఖపట్నం జిల్లాలో పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 63,879 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమక్షంలో దగ్ధం చేసిన గంజాయి సుమారు 13కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో 13 పోలీసు స్టేషన్లలో పదేళ్లలో 455 కేసులు నమోదయ్యాయి. నిల్వ ఉన్న గంజాయిని న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు కాల్చివేశారు. హుకుంపేట, ముంచింగిపుట్, పెదబయలు, అనంతగిరి, జి. మాడుగుల, కొత్తకోట, రావికమతం, రోలుగుంట, కశింకోట, సబ్బవరంలలో గంజాయిని పట్టుకున్నారు. కమిటీ సభ్యులైన రెంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, ఎక్సైడ్ డిప్యూటీ కమిషనర్ టీ. శ్రీనివాసరావులు తనిఖీ చేసి గంజాయి తూకం వేసి దగ్ధం చేశారు.
ఇదీ చదవండి:బొబ్బిలిలో పేలుడు... 3 ఇళ్లు నేలమట్టం