విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం బలపాము సచివాలయాన్ని కలెక్టర్ వినయ్ చంద్ సందర్శించారు. సిబ్బందితో మాట్లాడారు. అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి వైద్య సేవలపై ఆరా తీశారు.
అవన్నీ వినియోగించుకోవాలి..
గ్రామ కేంద్రాల ద్వారా 547 రకాల సర్కార్ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వాటిని అందరూ వినియోగించుకోవాలని కోరారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి రైతు భరోసా కేంద్రాలు, సచివాలయం, ఆరోగ్య కేంద్రాలు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థానిక వాగులు వంకల నుంచి ఇసుకను తరలించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వరరావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
'కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన అమరావతి ఐకాస నేతలు'