విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో కరోనా కట్టడికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేయూతనిచ్చింది. మొత్తంగా ఆయా అవసరాలకు సంబంధించి 32 లక్షల 50 లక్షలను అందజేశారు. అందులో 23లక్షల50 వేలు చెక్ రూపంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, వీఎంఆర్డీఏ కమిషనర్ పి.కోటేశ్వరరావుకు అందజేశారు. మిగతా 9 లక్షల మొత్తాన్ని సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్, ఇతరులకు బదలాయించారు. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు అకుంఠిత చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు, వైద్యులు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, తదితరులు తీసుకుంటున్న చర్యలను ఎంపీ ఎంవీవీ అభినందించారు.
ఇదీ చూడండి యర్రగొండపాలెంలో నాటుసారా అక్రమ దందాపై చర్యలు