ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత అర్థరాత్రి నుంచి 108 ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ విశాఖలో 108 ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శించారు.
ఇదీ చదవండి