ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేకు చెందిన మహిళా లోకో పైలట్ జి.శిరీష, ఇతర సిబ్బందితో మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించడం సంతోషాన్ని కలిగించిందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ రవాణాలో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ప్రధానితో మాట్లాడే అవకాశం దక్కినందుకు శిరీషను అభినందిస్తున్నాఅని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
విజయనగరం మామిడి ప్రస్తావన మనకు గర్వకారణం
‘విజయనగరం నుంచి దిల్లీ, ఇతర ప్రాంతాలకు కిసాన్ రైల్ ద్వారా మామిడి ఎగుమతుల విషయాన్ని మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని గవర్నర్ అన్నారు. దిల్లీ, ఇతర ఉత్తర భారతదేశ ప్రజలకు విజయనగరం మామిడి రుచి చూసే అవకాశం కలగడంతో పాటు, రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని ప్రధాని ప్రస్తావించారని గుర్తించారని గవర్నర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: