ETV Bharat / state

మట్టి మాఫియా.. పోలవరం కుడి కాలువ కట్టలు మాయం.. కనిపించని యంత్రాంగం - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Arbitrary and illegal excavation of soil : `మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్నట్లుగా తయారైంది వైసీపీ ప్రభుత్వ పాలన తీరు. బహిరంగ సభల్లో రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లు అబద్ధాలను వల్లెవేస్తూ ఉంటారు. వాస్తవానికి `దోపిడీకి ఏదీ కాదు అనర్హం’ అన్న రీతిలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు... అక్రమాలు, దోపిడీలకు యథేచ్చగా పాల్పడుతున్నారు.

పోలవరం కాల్వల మట్టి మాయం
పోలవరం కాల్వల మట్టి మాయం
author img

By

Published : Apr 8, 2023, 3:49 PM IST

Updated : Apr 8, 2023, 6:37 PM IST

Arbitrary and illegal excavation of soil: విజయవాడ నగరానికి కూత వేటు దూరం. వందల టిప్పర్లు రేయింబవళ్లు తిరుగుతున్నాయి.. దాదాపు 150 ఎకరాల్లో.. రెండు తాటిచెట్ల లోతున తవ్వకాలు.. అసైన్‌మెంట్, అటవీ, పోరంబోకు భూములు, పోలవరం కట్టలు.. ఇలా ఏ ఒక్కదాన్నీ వదలడంలేదు.. గ్రామస్తులు అడ్డుకుంటే.. ‘మేం ఎవరోతెలుసా.. ఎంపీ మనుషులం.. ఫలానా మంత్రి అనుచరులం..!’ అంటూ బెదిరింపులు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఉలకరు.. పలకరు..! వైఎస్సార్సీపీప ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే స్పందనలో ఫిర్యాదు చేసినా.. మీ విజ్ఞప్తి అందింది.. పరిశీలిస్తున్నాం..! అనే సమాధానం తప్ప చర్యలు శూన్యం.

సీనరేజీ చెల్లించక ఖజానాకు చిల్లు..: మట్టి తవ్వకాలు జరిపితే.. గనుల శాఖకు రూ.45చొప్పన, జలవనరుల శాఖకు రూ.90 చొప్పున ఒక ఘనపు మీటరు మట్టికి సీనరేజీ చెల్లించాలి. ఇవేవీ లేకుండా తరలిస్తున్నారు. ఒక లారీ మట్టి(25టన్నులు) కనీసం రూ.10వేల వరకు నిర్మాణ సంస్థలకు విక్రయిస్తున్నారు. కొన్నాళ్లుగా 1.50లక్షల లారీల మట్టి వెలికి తీసి ఉంటారని భావిస్తున్నారు. ఒక్కో లారీ మట్టి రూ. పది వేల చొప్పున అమ్ముకోగా రూ. 150 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళి ఉంటాయని భావిస్తున్నారు. పోలవరం కట్టలపై గడిచిన ఐదారు నెలల్లో రూ.50కోట్లపైగా మట్టి తవ్వకాలు జరిగాయి. ఈ లారీలకు ఆయా నిర్మాణ సంస్థల పేరుతో స్లిప్పులు అంటించడం.. అధికారులు పట్టుకుంటే.. ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారులకు సందేశాలు రావడం షరా మామూలైంది.
ఇరిగేషన్ అధికారుల సంతకాలు ఫోర్జరీా?..: పోలవరం ఈఈ కే. శ్రీనివాసరావు తాము ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. ఆయన పేరుతోనే అనుమతి పత్రాలు చూపిస్తున్నారు. అంటే ఇరిగేషన్ అధికార్ల సంతాలను ఫోర్జరీ చేసి మట్టి తరలింపులు సాగిస్తున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు జరిపి తరలిస్తున్న వ్యవహారంలో అనుమతి పత్రాలను అధికార్లు ఎందుకు తనిఖీ చేయరన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.200 కోట్ల మట్టిని తవ్వేశారని అంచనా. జాతీయ రహదారులు సంస్థ ఆధ్వర్యంలో రెండు మెగా సంస్థలు నిర్మాణం చేస్తున్న ఆరువరసల విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు.

23 లారీలకు నామమాత్రపు నోటీసులు..: కొత్తూరు తాడేపల్లి గ్రామం విజయవాడ నగరానికి సుమారు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. విజయవాడలో జిల్లా అధికారులే కాదు.. రాష్ట్ర సమీపంలోనే ఉన్నతాధికారులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం 14 లారీలను పోలీసులు పట్టుకున్నారు. దీంతో తాడేపల్లిలో మరుసటి రోజు గనులు, భూగర్భ గనుల శాఖ అధికారులు తనిఖీ చేస్తే.. మట్టిని తరలిస్తూ మరో 9 లారీలు పట్టుబడ్డాయి. ప్రస్తుతం మొత్తం 23 లారీలకు జరిమానాలతో సరిపెట్టిన అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి నామమాత్రపు నోటీసులు ఇచ్చారు. దీనిపై భూగర్భ గనుల శాఖ ఏడీ నోటీసులు ఇచ్చారు.

వైఎస్సార్సీపీ పాలనలోనే..: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం కట్టల తవ్వకాలు ప్రారంభం అయ్యాయి. ఇంతకు ముందు అనుమతులు తీసుకుని ఇద్దరు ఎమ్మెల్యేల బీనామీలు మట్టిని తవ్వుకున్నారు. ప్రస్తుతం ఏకంగా కీలక ప్రజాప్రతినిధి అనుమతి లేకుండానే .. పోలవరం కుడి కాలువ కరకట్టలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధి బినామీలు తవ్వేస్తున్నారు. కాలువ లోతుకంటే.. ఈ కట్టతవ్వకాలు కింది వరకు జరిగాయి. వీటీపీఎస్‌ బూడిద చెరువుపై కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి పట్టు పట్టిన విషయం తెలిసిందే. కట్టల తవ్వకాలను అడ్డుకున్నందుకు గత ఆరు నెలల్లో ఒక ఏఈ, ఇద్దరు డీఈఈలపై బదిలీ వేటు పడింది.
విచారణకు సహకరించని అధికార్లు..: అక్రమ మట్టి తవ్వకాలపై ఎన్‌జీటీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై విచారణ చేయాలను జిల్లా కలెక్టర్ ను ఎన్‌జీటీ ఆదేశించింది. తన తరపున సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ విచారణకు వెళితే.. ఒక్క అధికారి హాజరుకాలేదు. సహాయ నిరాకరణ వ్యక్తం కావడం విశేషం. తర్వాత మరోసారి విచారణకు వచ్చినా గనుల శాఖ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు రాలేదు. ఇక నివేదికపై ప్రజాప్రతినిధుల ప్రభావం సరేసరి.. ఒకవైపు విచారణ జరుగుతున్నా.. మరోవైపు తవ్వకాలు జరుగుతూనే ఉంటడం విశేషం. అధికారులు మాత్రం నిలిపివేశామని చెబుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 8, 2023, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.