- కాస్త ఉపశమనం: క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్ఫ్యూ, 144 సెక్షన్‌తో కరోనా కేసుల తగ్గుదల: సింఘాల్
రాష్ట్రంలో ఇప్పటివరకూ 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో కరోనా కేసుల పెరుగుదల తగ్గుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని 66 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు : వాతావరణ శాఖ
మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు రాకకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనాథ చిన్నారులకు పీఎం కేర్స్ నుంచి రూ.10 లక్షలు!
కొవిడ్ మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్' ద్వారా సాయం అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనాథలకు అండగా సీఎం- రూ. 5లక్షల సాయం
కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆపన్నహస్తం అందించేందుకు తమిళనాడు సర్కారు ముందుకొచ్చింది. అనాథలైన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ సోకిన తొలి రోగి మృతి
దేశంలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ (fungus) సోకిన తొలి కరోనా బాధితుడు చనిపోయారు. రక్తం విషపూరితంగా మారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viral: తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం!
అంతర్జాలంలో మదిని దోచుకునే సంఘటనలు ఎన్నో. అలాంటిదే ఇది కూడా. ఓ దివ్యాంగ చిన్నారి తన తల్లి ప్రోత్సాహంతో చిన్న గొయ్యి నుంచి బయటకు రావడాన్ని చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. ఆ వీడియో చూడటానికి క్లిక్ చేయండి
- క్రెడిట్ స్కోర్ తగ్గిపోయేందుకు కారణాలేంటి?
రుణం లేదా క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే బ్యాంకులు తప్పకుండా పరిగణనలోకి తీసుకునేది క్రెడిట్ స్కోరు(Credit Score). మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణం, క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు బ్యాంకులు మొగ్గు చూపుతాయి. రుణం తీసుకున్నప్పుడు, క్రెడిట్ కార్డులు తీసుకున్నప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గిపోతుండటం చూస్తుంటాం. ఎందుకు? క్రెడిట్ స్కోరు ఏఏ అంశాల వల్ల తగ్గిపోతుంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుశీల్ కస్టడీ మరో 4 రోజులు పొడిగింపు
భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మరో నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీని పొడిగించింది దిల్లీ కోర్టు. ఏడు రోజుల రిమాండ్ కావాలని కోరగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఈ సినిమా.. జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం'
'ఏక్ మినీ కథ' చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. బోల్డ్ కథతో తెరకెక్కినా సరే ఎక్కడా గీత దాటకుండా ఈ సినిమాను రూపొందించారు. ఈ క్రమంలో హీరో సంతోష్ శోభన్ పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి