తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని.. తితిదే నిర్ణయించింది. అలిపిరిలో తనిఖీ చేస్తామని.. ప్లాస్టిక్ రహిత వస్తువులనే తిరుమలకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధిస్తున్నామన్న తితిదే అధికారులు.. తిరుమలలోని దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధానికి దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు. దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు.
ఇవీ చూడండి..