Nara Lokesh Comments : జగన్ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడుతోంది భవన నిర్మాణ కార్మికులేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. నారా లోకేశ్ గత నెల చేపట్టిన యువగళం పాదయాత్ర 27వ రోజున తిరుపతికి చేరుకుంది. అద్భుతమైన ఇసుక విధానం తీసుకువస్తానని అన్న జగన్.. భవన నిర్మాణ కార్మికులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. కార్మికుల ఆరోగ్య బీమాను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో బంగారమైనా దొరుకుతుందేమో కానీ.. ఇసుక మాత్రం దొరకదని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ ఇసుక దందా చేస్తున్నారని విమర్శించారు.
ఇసుకు అక్రమ రవాణా ద్వారా రోజుకు 3కోట్ల రూపాయలు జగన్ రెడ్డి సంపాదిస్తున్నాడని.. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుకకు వెయ్యి రూపాయలు ఉంటే.. నేడు జగన్ పాలనలో 5 వేలకు చేరిందన్నారు. సిమెంట్ ధరలు జగన్ పాలనలో 60 శాతం పెరిగాయని దుయ్యబట్టారు. సంక్షేమ బోర్డు ద్వారా సేకరించిన సెస్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిదని అన్నారు. కార్మికుల సమస్యల గురించి ఒక్క రోజైనా మంత్రి జయరాం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
"గడిచిన మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు చేసిందేమిటి. మా అంచనా ప్రకారం 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఇసుక ధరను తగ్గించే భాద్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతం చేసి చూపెట్టాము. ఉచితంగా పంపిణీ చేశాము." నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి :