ETV Bharat / state

డిగ్రీ మధ్యలో మానేసిన తమ్మినేని... ఎల్‌ఎల్‌బీలో ప్రవేశమెలా పొందారు?: నన్నూరి నర్సింహారెడ్డి

Nannuri Narsireddy Criticizes AP Speaker Tammineni Sitaram: డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో ప్రవేశమెలా పొందారో చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సింహారెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి చదువుల్లో ఏమైనా మినహాయింపులు ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తమ్మినేని సీతారాం, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు త్వరగా స్పందించి.. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

నన్నూరి నర్సింహారెడ్డి
నన్నూరి నర్సింహారెడ్డి
author img

By

Published : Mar 23, 2023, 9:58 PM IST

Updated : Mar 24, 2023, 6:36 AM IST

Nannuri Narsireddy Criticizes AP Speaker Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సింహారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో ప్రవేశమెలా పొందారు?.. అని ప్రశ్నించారు. గతంలో పలుమార్లు తమ్మినేనే.. తాను డిగ్రీ మధ్యలో ఆపేసినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారని... 2019 ఎన్నికల అఫిడవిట్‌లోనూ అదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి చదుల్లో ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తమ్మినేని, ఉస్మానియా వర్శిటీ అధికారులు వెంటనే స్పందించాలని నర్శింహా రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా నన్నూరి నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారు?. డిగ్రీ లేకుండానే తమ్మినేని సీతారాంకి 2019-20 సంవత్సరంలో మహాత్మాగాంధీ లా కాలేజీలో ఎలా అడ్మిషన్ వచ్చింది?. తాను డిగ్రీని మధ్యలోనే ఆపేశానని తమ్మినేని సీతారాం గారే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో సైతం అదే అంశాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. తమ్మినేని సీతారాం గారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారని.. చదువుల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన వారికి ఎల్‌ఎల్‌బీలో సీటు ఎలా వచ్చిందనే అంశంపై తమ్మినేని సీతారాంతోపాటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు స్ఫందిచాలి. అంతేకాదు, దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి, ఇలాంటి అక్రమాలు భవిష్యత్‌లో మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అంశంపై విచారణ జరిపితే.. ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు వస్తాయి. ఇప్పటికైనా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించి.. సభాసాక్షిగా లేక మీడియా సాక్షిగా అయినా.. ప్రజలకు అసలు విషయం తెలపాలి.'' అని నన్నూరి నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

చర్చనీయాంశమైన స్పీకర్ వ్యాఖ్యలు... తాజాగా శాసన సభలో గవర్నర్ ధన్యవాద తీర్మానంపై జరిగిన పరిణామాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. 2016వ సంవత్సరంలోనే శాసన సభ... ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ తర్వాత వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేలా నిర్ణయం తీసుకుందని.. అదేమీ తెలియకుండా ప్రతిపక్షం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రోజుల్లో ఏం చేసింది, రాబోయే రోజుల్లో రోజుల్లో ఏం చేయబోతోంది అనేది గవర్నర్‌ ప్రసంగం ద్వారా చెప్పడం రాజ్యాంగ సంప్రదాయమన్నారు. దానికి కూడా గౌరవాన్ని ఇవ్వలేని ఈ ప్రతిపక్షం సభలో ఉండటం, ఆ సభలో తాను స్పీకర్‌గా ఉండటం చాలా బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సభ్యులు, పార్టీల పట్ల తనకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవని.. ఎస్సీ ఎమ్మెల్యేల పేరిట సభలో చర్చ రావడం దురదృష్టకరమని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 24, 2023, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.