ETV Bharat / state

Smart Cities Works in AP: ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా..మడమ తిప్పినట్లే..! - visakhaptanam smart city

No Development in Smart Cities Works: అధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పిన జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు ఏం చేశారు? కేంద్రం తన వాటా నిధులనిచ్చినా.. రాష్ట్రం తరఫున సకాలంలో ఎందుకు జమ చేయలేకపోయారు? కేంద్రం వాటా సొమ్మునైనా ఖర్చు చేయగలిగారా? నాలుగేళ్ల కాలంలో నాలుగు నగరాల రూపురేఖలను మార్చగలిగారా? ప్రాజెక్టులను పూర్తి చేయలేక.. కొన్నింటిని పూర్తిగా వెనక్కి తీసుకున్న విషయం వాస్తవం కాదా? మరికొన్నింటిని అలాగే గాలికి వదిలేసిందీ నిజం కాదా..? స్మార్ట్‌ సిటీల అభివృద్ధి అంటే ఇదేనా సీఎంగారూ?..

smart cities
smart cities
author img

By

Published : Jul 16, 2023, 12:12 PM IST

ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా..మడమ తిప్పినట్లే..!

No Development in Smart Cities Works : 2018 జులై 18న కాకినాడ బహిరంగ సభలో జగన్‌ ఉక్రోశం ప్రదర్శించారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేని అసమర్థుడంటూ.. చంద్రబాబును తిట్టిపోశారు. మరి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ సమర్థతేంటి?. దానికి సమాధానమే.. కాకినాడలో ప్రారంభానికి నోచుకోకుండానే పాడుబడిపోతున్న.. ఈ గోదావరి కళాక్షేత్రం.

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు స్వరూపం: తెలుగుదేశం హయాంలో మొదలైన నిర్మాణ పనులు దాదాపు తుదిదశకు వచ్చాయి. ప్రభుత్వం మారగానే.. ఇదొక కళావిహీన క్షేత్రంగా మారిపోయింది. పెండింగ్‌ పనుల్ని పట్టించుకోకపోవడంతో.. ప్రాంగణంలో పిచ్చిగడ్డి మొలిచింది. గతంలో అమర్చిన సీలింగ్‌, ఇతర సామాగ్రి మెయింటెనెన్స్‌ లేక కొంత పాడైపోయింది. ఇక.. సురక్షిత కాకినాడే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కూడా మూతపడింది.

డబ్బులివ్వక పోవడంతో గుత్తేదారు సంస్థ మావల్ల కాదంటూ.. వెళ్లిపోయింది. ఫలితంగా సీసీ కెమెరాల వ్యవస్త ఉండీ ఉపయోగంలేని పరిస్థితి నెలకొంది. ఇవేకాదు.. సైన్స్‌ సెంటర్‌, కన్వర్టబుల్‌ స్టేడియం.. ఇలా స్మార్ట్‌ సిటీ కింద కాకినాడలో.. మొత్తం 76 ప్రాజెక్టుల్ని ప్రతిపాదిస్తే.. అందులో 26 పనులను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోంది. బిల్లుల చెల్లింపులో జాప్యం సహా పలు కారణాలే.. దీనికి కారణంగా కనిపిస్తోంది.

ఇక.. విశాఖ స్మార్ట్‌ సిటీ సంగతి చూద్దాం. ఆర్థిక రాజధాని అని కలవరించే జగన్‌.. సాగరనగరంలో అభివృద్ధి పనుల్ని మాత్రం పరుగులు తీయించలేకపోతున్నారు. 61 ప్రాజెక్టులు విశాఖ స్మార్ట్‌సిటీ కింద చేపట్టగా.. చాలా వరకూ ఇంకా పూర్తికాలేదు. సిటీకి కీలకమైన.. గాజువాక, పెందుర్తిలో భూగర్భ మురుగునీటి.. ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో అని నాలుగేళ్లుగా నగరవాసులు ఎదురు చూస్తున్నారు.

వైఎస్సార్​సీపీ వచ్చాక ఏం చేసిందో తెలుసా?: ఇక అమరావతి స్మార్ట్‌సిటీ గురించి.. మాట్లాడుకోవడానికేమీలేదు. ఏదో కక్ష గట్టినట్లే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత ప్రభుత్వ హయాంలో.. 21 ప్రాజెక్టులను అమరావతి స్మార్ట్ సిటీ పరిధిలో ఆమోదించగా.. ఇందులో 10 ప్రాజెక్టులను వైఎస్సార్​సీపీ సర్కార్‌ పూర్తిగా వెనక్కి తీసేసుకుంది. మరో.. 11 ప్రాజెక్టుల పనుల్ని అసంపూర్తిగా వదిలేసింది. దానికి నిదర్శనమే ఎక్కడివక్కడే గుట్టలుగా పోగుబడిన ఈ విద్యుత్‌ కేబుళ్లు. మంచినీటి పైపులైన్లు కూడా.. మట్టి కొట్టుకుపోయాయి. మౌలిక వసతుల కల్పన కోసం.. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి తెప్పించిన సామాగ్రి.. పిచ్చిమొక్కల మధ్య పాడుబడిపోతోంది.

ఇక తిరుపతి స్మార్ట్‌ సిటీ పనులైతే.. నత్తతో పోటీపడుతున్నాయి. మొత్తం 116 ప్రాజెక్టుల్ని తిరుపతిలో ప్రతిపాదించారు. అందులో.. కీలకమైన శ్రీనివాస వారధి పైవంతెన పనులనూ వైసీపీ సర్కారు పూర్తి చేయలేకపోయింది. భూగర్భ కేబులింగ్‌ వ్యవస్థ పనుల్లో.. ఎడతెగని జాప్యం జరుగుతోంది. రోడ్లు తవ్వేసి పనులు వేగంగా చేయించకపోవడం.. ప్రజలకు ఇబ్బందిగా మారింది.

స్మార్ట్‌సిటీ పనుల్లో గత ప్రభుత్వ హయాంలోనే మొదలైన వాటిలో.. చాలా వరకూ పూర్తి చేయించలేకపోయిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక కొన్నింటిని పూర్తిగా వెనక్కి తీసుకుని.. చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారు. కేంద్రం తన వాటా సొమ్ము విడుదల చేసినా.. వాటిని ఖర్చు చేయకుండా కొద్ది నెలల క్రితం వరకూ వైసీపీ ప్రభుత్వం తన వద్దే అట్టేపెట్టుకుంది. నిధులిస్తే.. పెండింగ్‌ బిల్లులు చెల్లించి, మిగతా పనులు పూర్తి చేస్తామని.. స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్లు నెత్తీనోరూ బాదుకున్నాకే ఆర్థిక శాఖ స్పందించింది.

812 కోట్ల రూపాయలు విడుదల చేసినా.. అవన్నీ పెండింగ్‌ బిల్లులకే సరిపోయాయి. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాల స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్ల భాగంగా.. ఒక్కో నగరంలో రూ. వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ. 4 వేల కోట్ల పనులకు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వాటా భరించేలా.. 4వేల 633 కోట్ల రూపాయల విలువైన 274 ప్రాజెక్టుల్ని ప్రతిపాదించారు. ఇందులో.. 777 కోట్ల రూపాయలతో 122 ప్రాజెక్టులు.. గత టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయి. మిగితావావి వివిధ దశల్లో ఉన్నాయి.

రాష్ట్ర వాటా ఇవ్వటంలోనూ జాప్యమే: వైసీపీ అధికారంలోకి వచ్చాక.. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడంలో.. తాత్సారం చేస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాగా రూ.650 కోట్లు విడుదల చేస్తే.. వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో 400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్ర నిధులతోనే నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ సర్కారు తీరుకు విసిగిపోయిన కేంద్రం సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా జమ చేశాకే మిగతావి విడుదల చేస్తామని.. గతేడాది స్పష్టం చేసింది.

అప్పుడు 812 కోట్ల రూపాయల కేంద్ర వాటా నిధులను సింగిల్‌ నోడల్‌ ఏజన్సీ ఖాతాకు.. బదిలీ చేసిన ప్రభుత్వం.. తన వాటా మాత్రం ఇవ్వడంలేదు. అప్పట్లో స్మార్ట్‌ సిటీలకు చంద్రబాబు ముష్టివేస్తున్నారంటూ విరుచుకుపడిన జగన్.. అధికారంలోకి వచ్చాక.. ఆ కాస్త కూడా వేయడం లేదు. కనీసం.. కేంద్రం వాటాకు తగినట్లు రాష్ట్ర నిధులను జమ చేయించకుండా తన చేతగానితన్నాన్ని.. చాటుకున్నారు. స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో అసమర్థులెవరో? సమర్థులెవరో.. ఆత్మవిమర్శ చేసుకుని.. పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని.. ప్రజలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.