Janasena Leader Kiran Royal: జనసేన పార్టీ పై మంత్రి రోజా వ్యాఖ్యలను తిప్పికొట్టిన తిరుపతికి చెందిన ఆ పార్టీ నాయకుడు కిరణ్ రాయల్‌కు బెయిల్ మంజూరైంది. కిరణ్‌రాయల్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైకాపా మహిళా కార్యకర్తలు అక్టోబర్ 18న నగరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నగరి పోలీసులు కిరణ్‌రాయల్‌ను శుక్రవారం రాత్రి తిరుపతిలో అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం నగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కిరణ్ రాయల్‌కు 41A కింద నోటీసులు ఇవ్వాలన్న న్యాయస్థానం రూ.10 వేల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ రాయల్ బెయిల్ పై విడుదలైన తర్వాత నగరిలో ర్యాలీ చేసిన జనసేన నేతలు.. మంత్రి రోజా ఇంటి ముందుకు రాగానే తొడగొట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: