ETV Bharat / state

తిరుమలలో డ్రోన్‌ కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఆలయంపై నుంచి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయడంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో నిజమైందా? కాదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

tirumala drone
tirumala drone
author img

By

Published : Jan 20, 2023, 10:38 PM IST

Tirumala Drone Video: తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన వీడియో ఒకటి కలకలం సృష్టించింది. ఈ వీడియో శుక్రవారం సాయంత్రం సోషల్‌ మీడియాలో కనిపించడంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. విమానాలను సైతం శ్రీవారి ఆలయం వైపునకు వెళ్లకుండా చూడాలని గతంలోనే పలువురు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంపై నుంచి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన వీడియో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. డ్రోన్‌తో చిత్రీకరించినా తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించలేకపోవడం భద్రతా వైఫల్యంగా భక్తులు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట గొల్లమండపంపై, శ్రీవారి ఆలయంపైన నిరంతరం భద్రతా సిబ్బంది నిఘా ఉంటుంది. అలాంటిది భద్రతా సిబ్బంది ఎవరూ ఈ డ్రోన్‌ చిత్రీకరణను గుర్తించలేకపోయారు. మరోవైపు తిరుమల వ్యాప్తంగా 1600కు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అందులోనూ ఈ డ్రోన్‌ వ్యవహారం బయటపడకపోవడం గమనార్హం.

విచారణ చేస్తున్నాం: ‘‘తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరణకు సంబంధించిన వీడియో నిజమైందా? కాదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం. సైబర్‌ క్రైమ్‌లో దీనిపై తనిఖీ చేస్తున్నాం. గతేడాది నవంబర్‌లో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించాం. పూర్తిస్థాయిలో తనిఖీచేసి ఈ వీడియో అసలైందా? నకిలీదా? అని గుర్తించి చర్యలు తీసుకుంటాం’’ అని వీజీవో బాలిరెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.