Cheetah wandering at Sri Venkateswara University: తిరుపతిలో చిరుతపులి భయం కొనసాగుతోంది. మూడు రోజు క్రితం లక్షిత అనే చిన్నారిని పొట్టన పెట్టుకున్న చిరుతపులి ఘటనతోో.. తిరుపతికి వచ్చే భక్తుల్లో భయాందోళన మొదలైంది. దీంతో బోనుతో ఓ చిరుతను బందించిన అధికారులు.. మరో ఐదు చిరుతలు ఇక్కడే సంచరిస్తున్నాయని బాంబు పేల్చారు. దీంతో స్థానికంగా ఉంటే అధికారులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో, తాజాగా సోమవారం సాయంత్రం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చిరుతను చూసిన విద్యార్థులు ఆందోళన చెంది.. పరుగులు తీశారు. వేద విశ్వవిద్యాలయంలోనూ రాత్రి చిరుత సంచరించినట్లు గుర్తించారు. దీనిపై విద్యార్థులు అటవిశాఖ అధికారులకు ఉప్పందించారు. దీంతో చిరుతపులి సంచారంపై.. అటవిశాఖ అధికారులు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు.
Cheetah wandering at Sri Venkateswara University: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం.. పరుగులు తీసిన విద్యార్థులు - తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత
21:43 August 14
ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చిరుతను చూసి విద్యార్థుల ఆందోళన