ETV Bharat / state

జగన్​ ప్రభుత్వానికి అంతం పలుకుతాం: బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు - somu veerraju

BJYM YUVA SANGHARSHANA: తిరుపతిలో భారతీయ జనతా యువ మోర్చా యువ సంఘర్షణ యాత్రను బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే యాత్ర చేపట్టినట్లు తెలిపారు. యువ సంఘర్షణ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు.

BJYM YUVA SANGHARSHANA
BJYM YUVA SANGHARSHANA
author img

By

Published : Aug 2, 2022, 3:44 PM IST

BJYM YUVA SANGHARSHANA YATRA: వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువ సంఘర్షణ యాత్రను చేపట్టింది. ఇవాళ్టి నుంచి.. 20 రోజుల పాటు సాగే యాత్ర ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతలో చైతన్యం తేస్తామని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య చెప్పారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య (pingali venkayya) జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

తిరుపతి నుంచి ప్రారంభమైన యాత్రలో పాల్గొన్న తేజస్వి సూర్య(Tejaswi Surya).. జగన్‌ ప్రభుత్వానికి అంతం పలుకుతామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పటివరకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. మూడేళ్లు గడిచినా జగన్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, అవినీతి రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు(three capitals) లేవని.. మూడు రాజధానులు అవినీతి కోసం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు.

SOMU VEERRAJU: ప్రధాని మోదీ పథకాలకు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీ దశ, దిశ కోసం యువ సంఘర్షణ యాత్ర చేపట్టామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.