నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వైకాపా రెండు వర్గాలుగా విడిపోయి.. పంచుకున్నారని శ్రీకాకుళం జిల్లా కోటబోమ్మాళిలో వైకాపాకు చెందిన మరో వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట వారంతా ధర్నా చేశారు. 53 మందికి సంబంధించిన ఇళ్ల పట్టాలను తొలగించారని మండిపడ్డారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు.
ఇదీ చదవండి: గ్రూప్-2 అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఏపీపీఎస్సీ