పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతల బెదిరింపుల పర్వం నేటికి కొనసాగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామంలో ఓ వైకాపా నాయకుడు హెచ్చరిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పథకాలు కావలంటే వైకాపా మద్దతు దారునికే ఓటు వేయాలని బహిరంగంగా బెదిరింపులు చేశాడు.
"మా ప్రభుత్వం అధికారంలో ఉంది. వైకాపా మద్దుతుదారుడు గెలిస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తాం. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెదేపాకు చెందిన వారివి 40 పింఛన్లు తీసేస్తే... ఇప్పటివరకు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. తెదేపా బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపిస్తే.. రెండు నెలల్లో వారి చెక్ పవర్‌ను తొలగించేస్తా. అలాగే సర్పంచ్ పదవిని కూడా తీసేస్తా. సీఎం జగన్ అందరికీ పథకాలు ఇస్తున్నాడు కదా అని అవతల వ్యక్తికి ఓటు వేస్తే... ఆ పథకాలు ఎలా నిలుపుదల చేయాలో నాకు తెలుసు. నేను ఒకసారి పథకాలు తీసేస్తే అవి తిరిగి ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు తెలియదు. మేము బలపరిచిన అభ్యర్థులు గెలవకపోతే 21 తర్వాత మేం ఎంటో చూపిస్తాం". : వైకాపా నేత
ఇదీ చదవండి