శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామంలో యాదవ్ కుటుంబీకులు గ్రామ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కులదేవత గంగమ్మ తల్లి, రామయ్య తండ్రికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ పండగ పూర్వీకుల నుంచి వస్తోందని, తమ యాదవ కుటుంబాల.. పండుగని వారు చెబుతున్నారు. ఈ పండగకు బంధువులు ఏ ప్రాంతంలో ఉన్నా గ్రామానికి వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళ్తారని.. గ్రామస్థులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు జరిపారు.
ఇదీ చూడండి: పటిష్ఠ ఏర్పాట్ల నడమ.. పుర పోలింగ్