ETV Bharat / state

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన - poshan Abhiyan

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్​వాడీ కార్యకర్తలకు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Jun 7, 2019, 8:53 PM IST

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళలు, చిన్నారులు ఆహార భద్రత పాటించేలా అంగన్​వాడి కార్యకర్తలు కృషి చేయాలని పోషన్ అభియాన్ స్వాస్థ్ అధికారి కె.సౌమ్య సూచించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తోన్న అంగన్వాడి సిబ్బందికి ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఆహార భద్రత విలువలను పాటించేందుకు అంగన్​వాడి కార్యకర్తల కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారి అనంతలక్ష్మి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : జగన్ జట్టులో ముగ్గురు 'నాని'లు

నరసన్నపేటలో ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమం

మహిళలు, చిన్నారులు ఆహార భద్రత పాటించేలా అంగన్​వాడి కార్యకర్తలు కృషి చేయాలని పోషన్ అభియాన్ స్వాస్థ్ అధికారి కె.సౌమ్య సూచించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పని చేస్తోన్న అంగన్వాడి సిబ్బందికి ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఆహార భద్రత విలువలను పాటించేందుకు అంగన్​వాడి కార్యకర్తల కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారి అనంతలక్ష్మి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : జగన్ జట్టులో ముగ్గురు 'నాని'లు

Intro:Ap_cdp_46_07_JK_arati dhara_adaraho_pkg_c7
అరటికి మంచి ధరలువచ్చాయి. ఇన్నాళ్లు మంచి దిగుబడులు ఉన్నా సరైన ధర లేక రైతులకు ఆశించిన ఆదాయం దక్కలేదు. వర్షాభావం, ఇటీవల వీచిన ఈదురు గాలులతో పంట నష్టం జరిగింది. దీంతో గిరాకీ పెరిగింది ఇదే సమయంలో పంట దిగుబడి తగ్గిపోవడంతో జిల్లా రైతులు నిరాశకు గురవుతున్నారు ప్రస్తుతం తోటలో దిగుబడులు ఉన్న కర్షకులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో 2,200 హెక్టార్లలో అరటి పంట సాగులో ఉంది. ఇందులో లో 50 శాతం పంట భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటల మాడిపోయాయి. మిగిలిన పంటలో లో 30 శాతం పంటలు వర్షాలు ఈదురు గాలులకు దెబ్బతిన్నాయి. ఇప్పుడున్న 20 శాతం పంట మాత్రమే మార్కెట్కు అందుబాటులో ఉంది. దీంతో ధర టన్ను 12 వేల రూపాయల నుంచి 14 వేల రూపాయల వరకు ఉంది. ప్రస్తుతం పంట చేతిలో ఉన్న రైతులకు కనక వర్షం కురిపిస్తోంది.
* కడప జిల్లాలో రాజంపేట రైల్వేకోడూరు, లింగాల, పులివెందుల ప్రాంతాల్లో అరటి పంట విస్తారంగా సాగు చేస్తున్నారు గత 5 నెలల క్రితం వరకు మంచి దిగుబడి వచ్చింది. కానీ అప్పుడు నన్ను ఆరేడు వేల రూపాయలు మాత్రమే ఉండేది. తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి విపరీతమైన ఎండలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తగ్గింది. ఉన్న పంట కూడా ఇటీవల వచ్చిన అకాల వర్షాలు ఈదురుగాలులతో తుడిచిపెట్టుకుపోయింది దీంతో దిగుబడి చాలా తక్కువగా ఉంది ఫలితంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మామిడి, బొప్పాయి కూడా పెద్దగా మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో అరటికి డిమాండ్ పెరిగింది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా మార్కెట్లోకి రాకపోవడం వంటి కారణాలతో మన అరటికి డిమాండ్ పెరిగింది గత రెండు మూడు నెలలుగా టన్ను 10 వేల రూపాయల నుంచి 14 వేల రూపాయల వరకు చేరుకుంది దీంతో దిగుబడులున్న రైతుల్లో ఆనందం కనిపిస్తుండగా పంట కోల్పోయిన కర్షకులు ఆవేదన చెందుతున్నారు.
* పంట ఉంటే పండగే....; అరటి ఉందా మంచి ధర ఇస్తామంటూ వ్యాపారులు రైతులకు ఫోన్లు చేసే పరిస్థితి వచ్చింది. ఎదుగు బొదుగు లేని అరటి పంటను కూడా కుంటున్నారు. నాణ్యమైన అరటిని బాక్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. వీరికి మాత్రం 13 నుంచి 14 రూపాయల వరకు ధర ఉంది. ఇక గెలతో సహా టన్నుల ప్రకారం కొనుగోలు చేసి అరటికి నాణ్యతను బట్టి 9 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ఇస్తున్నారు.
* కలిసి రాని కాలం.....; తీవ్ర వర్షాభావం, బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడం, కొత్త బోర్లు వేసినా చుక్క నీరు పడని పరిస్థితుల వల్ల చేతికొచ్చే అరటి గెలలు మలమల మాడిపోయాయి. రైతులు విలవిలలాడిపోయారు. పకృతి వైపరీత్యాలకు నోటి కాడి పంట కళ్లెదుటే నేల కూలిపోయింది. ఇలాంటి పరిస్థితిలో అరటి దిగుబడి చాలా తగ్గిపోయింది. ఎకరా అరటి సాగుకు 70 వేల నుంచి 80 వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఎకరాకు సుమారు 30 నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తుంది కానీ నీ వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి 25 టన్నులకు పడిపోయింది. అయినా ప్రస్తుతమున్న ధర ప్రకారం ఎకరాకు ఖర్చులన్నీ పోను రెండు లక్షల వరకు ఆదాయం వస్తోంది. అదే వర్షాలు సకాలంలో కురిసి భూగర్భ జలాలు అందుబాటులో ఉండి ఉంటే మరింత ఆదాయం పెరిగి చేసిన అప్పుల కష్టాలు తిరేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Body:అరటి ధర అదరహో


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.