ETV Bharat / state

ఊళ్లో ఉండాలంటూ భర్త ఒత్తిడి.. ఉరి వేసుకుని భార్య ఆత్మహత్య - srikakulam news

ఒడిశా వెళ్లి తన తల్లి దగ్గర ఉండాలంటూ భర్త ఒత్తిడి చేశాడు. పిల్లల చదువుల కోసం ఆమె ససేమిరా అంది. తన సోదరుడితో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తోంది. ఇంతలోనే ఏమైందో తెలియదు.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

women suicide
తల్లి వద్దకు వెళ్లాలంటూ భర్త ఒత్తిడి.. ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Mar 16, 2021, 11:57 AM IST

ఒడిశాలోని పల్లెకు వెళ్లాలని భర్త ఒత్తిడి, పిల్లల చదువుల కోసం ఇచ్ఛాపురంలోనే ఉంటానని ఆమె.. వెరసి ఒత్తిడిని భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. బ్రాహ్మణవీధిలో అద్దె ఇంట్లో తన సోదరుడు జ్యోతిరాజ్​తో కలసి ఉంటున్న ధర్మాన స్వాతి (29) సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది.

పిల్లల చదువు కోసం...

ఒడిశాలోని గంజాం జిల్లా అంతర్సింగ్‌లోని పల్లెకు చెందిన ధర్మాన బలరాంపాత్రోకు పదేళ్ల క్రితం స్వాతితో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బలరాంపాత్రో ఉపాధి కోసం ఖతర్‌ వెళ్లాడు. అక్కడే ఉండాల్సి రావడంతో పిల్లలతో సహా తన తల్లి వద్దకు ఉండమని భార్య స్వాతిపై ఒత్తిడి తెచ్చేవాడని జ్యోతిరాజ్‌ తెలిపాడు. ఇచ్ఛాపురంలో ఉంటే పిల్లల చదువులు సాగుతాయని ఆమె వాయిదా వేస్తూ వస్తోంది. తరచూ అత్తవారింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటూ వచ్చేది.

ఏమైందోగానీ సోమవారం ఉదయం మేడపైన గదిలో పశువులను కట్టే తాడుతో ఉరివేసుకుందని, తాను వచ్చి చూసేసరికి కొనూపిరితోఉండగా, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తీసువెళ్లామని అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారని జ్యోతిరాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి సంఘటనా స్థలాన్ని సీఐ ఎం.వినోద్‌బాబుతో కలసి పరిశీలించారని ఎస్సై వివరించారు.

ఇదీ చదవండి:

తల్లీ కుమార్తె హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.