Water problems: శ్రీకాకుళం జిల్లా పాలస- కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు నీటి కొరత వేధిస్తోంది. 28 వార్డులో నీటి సమస్య దారుణంగా ఉండగా ఇవాళ ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా చేశారు. కులాయిల ద్వారా నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీరిస్తున్నారని వాపోయారు. ట్యాంకుల ద్వారా ప్రతీ రోజూ సరఫరా చేయాల్సి ఉండగా.. రెండ్రోజుల కు ఒకసారి మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ రోజూ ట్యాంకులు పంపించి నీటి కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. మూడు నెలల క్రితం మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా 28 వార్డు మహిళలు ధర్నా చేశారు.
ఇవీ చదవండి: