శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పొన్నుటురు గ్రామానికి చెందిన ఓ వివాహిత ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటుండగా.. నాన్నమ్మ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం.. ఇటీవల వివాహం చేసుకుంది. ఈ విషయం బయటకు తెలియడం.. కుటుంబ సభ్యులకు అవమానం కలుగుతుందనే ఉద్దేశంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి...