శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్ నిర్మాణంతోనే మత్స్యకారులు, గంగపుత్రుల వలసలను ఆపగలమని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో భావనపాడు, దేవునల్తాడ, శ్రీరాంపురం తదితర గ్రామాల ప్రజలతో మంత్రి సమావేశమయ్యారు.
![భావనపాడు పోర్టు నిర్మాణంతోనే గంగపుత్రుల వలసలను ఆపగలం: మంత్రి అప్పలరాజు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8940910_fisheries.png)
అక్కడే నిర్మిస్తున్నాం..
13 బెర్తులు కలిగిన పోర్టును దేవునల్తాడ, భావనపాడుల మధ్య కడుతున్నామని పేర్కొన్నారు. 3 వేల 6 వందల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం జరుగుతోందని మంత్రి వివరించారు. రెండు వేల నాలుగు వందల ఎకరాల భూసేకరణ కోసం అదనంగా 12 వందల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. స్థల సేకరణలో భాగంగా రెండు గ్రామాలను పూర్తిగా తరలిస్తామన్నారు.