వలస కార్మికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది మంది కార్మికులు కాలినడకన ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇటుక బట్టీల్లో పనిచేసే పశ్చిమ బంగా రాష్ట్రానికి చెందిన కార్మికులు తమ సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కష్టాలు పడుతున్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వరకు కాలినడకన ప్రయాణం చేసి మండుచెండలో ఓ టెంట్ కిందకు చేరారు. చిన్న పిల్లలు, మహిళలు ఉన్న ఈ బృందం జాతీయ రహదారిపై చెట్ల కింద విశ్రమించారు. వీరందరి పరిస్థితి గమనించిన నరసన్నపేట తహసీల్దార్ ప్రవళ్లిక ప్రియ వారందరినీ చేరదీసి భోజన వసతులు కల్పించి.. ప్రత్యేక వాహనాల్లో పశ్చిమ బంగాకు పంపించారు.
ఇదీ చదవండి: నాబార్డు చైర్మన్గా చింతాల గోవిందరాజులు నియామకం