ప్రజా సమస్యల పరిష్కారానికి రూపొందించిన ఓ వెబ్సైట్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ వెబ్సైట్ను డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ రూపకల్పన చేశారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వ్యయ, ప్రయాసలకోర్చి తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న వారు ఇకపై పిరియాసాయిరాజ్.కామ్ (http://www.piriyasairaj.com) అనే వెబ్సైట్ ద్వారా తమ సమస్యలు, ఫిర్యాదులు పంపవచ్చని డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వెబ్సైట్ను రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా నరసన్నపేటలో ప్రారంభించారు. సమస్యతో పాటు సంబంధిత అర్జీలు, డాక్యుమెంట్లను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని సాయిరాజ్ తెలిపారు.
సమస్య పరిష్కారం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని, అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేర వేస్తామని, ఫిర్యాదు అనంతరం తిరుగు రసీదులను సూక్ష్మ సందేశం రూపంలో ఫిర్యాదుదారునికి వస్తుందన్నారు.
24 గంటల తర్వాత సమస్య పరిష్కారం ఏ దశలో ఉన్నదనే విషయం వెబ్సైట్ ద్వారా పరిశీలించ వచ్చని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి సేవా వెబ్ సైట్ ను శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించామన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణకు బస్సు సర్వీసుల పునఃప్రారంభంపై చర్చలకు బ్రేక్: ఆర్టీసీ ఎండీ