నరసన్నపేట నుంచి మారుతీ నగర్ మీదుగా జలుమూరు మండలానికి వెళ్లే రోడ్లు భవనాల శాఖ రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. గొట్టిపల్లి మార్గంలో మారుతీ నగర్ వద్ద జాతీయ రహదారిపై వంతెన దిగువ చిన్నపాటి వర్షం పడితే చాలు ఇలా నీరు నిలిచిపోతోంది. రోజుల తరబడి నిలిచిపోయిన నీరు బయటకు వెళ్ళక.. ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. మేజర్ పంచాయతీ ఈవో మోహన్ బాబు స్పందించి ప్రొక్లెయినర్ ద్వారా ప్రత్యేక కాలువ తవ్వించి నీటిని మళ్లించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: 'జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి'