జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయిన కారణంగా... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయి నగర్, శ్రీనివాస్ నగర్ తదితర కాలనీల్లోకి చెరువు నీరు చేరుతుండడంపై ఆందోళనకు గురవుతున్నారు. గుంతల్లో నీరు నిండి ప్రమాదకరంగా మారాయన్నారు.
నరసన్నపేట సమీపంలో సత్యవరం కూడలి వద్ద ఓ చెరువు ఉంది. జాతీయ రహదారి కల్వర్టు పనులు లాక్ డౌన్ ముందు వరకూ కొనసాగాయి. ఆ తర్వాత నిలిచిపోయాయి. చెరువు నుంచి వచ్చిన నీరు జాతీయ రహదారిని దాటుకొని వీధుల్లో చేరుతోంది. ఆయా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.
లాక్ డౌన్ కారణంగా తాము ఇళ్లలోనే ఉంటుండగా, సరకుల కోసం బయటకు రావాలన్నా ఇబ్బందిగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై నరసన్నపేట ఈవో మోహన్ బాబుతో మాట్లాడగా.. జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: