ETV Bharat / state

ప్రజలను సోమరిపోతులను చెయ్యొద్దంటూ వాలంటీరు లేఖ

"పనికిరాని పథకాలు తీసుకొచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తున్నారు. ప్రజలను సోమరిపోతులను చేయొద్దు. అది మంచిది కాదంటూ" ఓ గ్రామ వాలంటీరు రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

volunteer-letter-to-cm-jagan-mohan-reddy-on-pension-issue
ప్రజలను సోమరిపోతులను చెయ్యొద్దంటూ వాలంటీరు లేఖ
author img

By

Published : Sep 4, 2021, 9:50 AM IST

‘పింఛను నిబంధనలను ఒక్కసారిగా మార్చేశారు. కొందరు ఈ-కేవైసీ అవ్వకపోవడం వల్ల తీసుకోలేకపోయారు. ఆ బకాయి పింఛను ఈ నెల ఇవ్వొద్దన్నారు. పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతుంది. కానీ ఎంతోమంది నిరుపేదలు పింఛనుకు దూరమయ్యారు. పనికిరాని పథకాలు తీసుకొచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తున్నారు. ప్రజలను సోమరిపోతులను చేయొద్దు. అది మంచిది కాదు. సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలి. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలి’ అంటూ శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీరు చిట్టివలస కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం పెట్టిన లేఖ వైరల్‌ అయింది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పథకాలపై కాక ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. ‘రూ.వేలల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారు. మాకు ఇస్తున్న రూ.5 వేల జీతం పెట్రోలుకూ సరిపోవట్లేదు. ఉద్యోగభద్రత లేక, ఎటూ వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని అందరూ హీనంగా చూస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Fire accident: రిఫ్రిజిరేటర్‌లో మంటలు చెలరేగి వృద్ధురాలి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.