ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి - vivekhanadha jyanthi visakha

స్వామి వివేకానంద 157వ జయంతిని రాష్ట్రంలో పలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల వివేకానందుని విగ్రహానికి పాలాభిషేకాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేకానందుని సేవలను కొనియాడారు.

vivekhandha jayanthi celebrations in all over the state
రాష్ట్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు
author img

By

Published : Jan 12, 2020, 8:31 PM IST

రాష్ట్రంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి వేడుకలు

వివేకానందుని జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశాఖలోని రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జైల్ రోడ్ నుంచి ఆర్కేబీచ్​ వరకూ యువతీయువకులు భారీ ర్యాలీ చేశారు. కర్నూలులోనూ యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని వైభవంగా చేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి విగ్రహాలకు పూలమాలలు వేశారు. విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద వివేకానంద విగ్రహానికి భాజపా నేతలు నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధి యువతపైనే ఆధారపడిందని మేధావులు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ.. స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్​ఎస్​ఎస్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 110 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేశారు.

ఇదీ చూడండి::

పోలీసుల తీరుకు నిరసనగా బైక్ ఎక్కిన చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.