శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో వర్షాలు కురవాలంటూ...లావేరు మండలం తామాడ పంచాయతీ పరిధిలోని కొత్త, పాత రౌతు పేట, తామాడ గ్రామాలకు చెందిన రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు 5 కిలోమీటర్ల మేర నడుచుకొని కొండపైకి వెళ్లి...వేద పండితులు మంత్రోచ్ఛరణాల మధ్య...వరుణు దేవుడికి సహస్ర నామర్చన, వరుణు జపం, అభిషేకాలు చేశారు. వరద పాశం వండి కొండ రాళ్లపై పోసిన అనంతరం ప్రజలు గ్రామస్థులంతా ప్రసాదాన్ని స్వీకరించారు.
ఇదీ చూడండి: ప్రేమించాడు.. అనుమానించాడు.. కత్తితో పొడిచేశాడు!